బావతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సింగర్ మంగ్లీ

బావతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సింగర్ మంగ్లీ

ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి మంగ్లీ(Mangli).. ఆ తరువాత ప్రైవేట్ సాంగ్స్ తో ఆడియన్స్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ ఫేమ్ తోనే వరుసగా సినిమాల్లో పాడే అవకాశం దక్కించుకుంది. మాస్ సాంగ్స్ కు కేరాఫ్ గా మారిపోయింది. అంతేకాదు.. నితిన్(Nithin) హీరోగా వచ్చిన మ్యాస్ట్రో(Mastro) మూవీలో నటించి ఆడియన్స్ ను మెప్పించింది మంగ్లీ.  

ALSO READ : నేను నిద్రపోలేదు... కెమెరా యాంగిల్‌ తప్పుగా ఉంది : టెంబా బావుమా

అయితే తాజాగా మంగ్లీ పెళ్ళి న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మాస్ సింగర్ త్వరలోనే తన బావని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు మంగ్లీ. “ఓరి దేవుడా.. నాకు తెలియకుండానే నా పెళ్లి కూడా చేసేస్తున్నారు. నాకు పెళ్లి ఏంటి. ప్రెజెంట్ ఆ ఆలోచన లేదు. అయినా.. నాకు తెలియకడుగుతాను నేను మా బావను పెళ్లి చేసుకుంటున్నాను అని రాస్తున్నారు..  నాకే తెలియని ఆ బావ ఎవరో కొంచెం చెబుతారా? అసలు ఇలాంటి పుకార్లు ఎవరు? ఇందుకోసం సృష్టిస్తారో అర్థం కావడం లేదు.. అంటూ తనదైన శైలీలో స్పందించింది మంగ్లీ. దీంతో మంగ్లీ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.