విరాట్ కోహ్లీని వివాదంలోకి లాగిన సింగర్ రాహుల్ వైద్య.. హీరోయిన్ పోస్ట్ లైక్ విషయంలో ఇంత రాద్ధాంతమా..?

విరాట్ కోహ్లీని వివాదంలోకి లాగిన సింగర్ రాహుల్ వైద్య.. హీరోయిన్ పోస్ట్ లైక్ విషయంలో ఇంత రాద్ధాంతమా..?

విరాట్ కోహ్లీ.. ఇండియాలో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెటర్ కమ్ సెలబ్రిటీ అంటే కోహ్లీని మించిన వాళ్లు ఉండరేమో. కోహ్లీ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే మిలియన్లు, బిలియన్లలో ట్రెండ్ అవుతుంటుంది. అంతేకాదు కోహ్లీ ఎవరి పోస్ట్ ను లైక్ చేసినా.. కామెంట్ పెట్టినా.. ఆ పోస్ట్.. ఆ అకౌంట్ కూడా వైరల్ అవ్వడం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. అందుకే మార్కెటింగ్ కంపెనీలన్నీ కోహ్లీ చుట్టే తిరుగుతుంటాయి. 

కింగ్ ఏ కంపెనీకి అంబాసిడర్ గా ప్రమోషన్స్ చేస్తే.. అది జనాల్లోకి ఇట్టే దూసుకుపోతుంది. అలాంటి కోహ్లీ.. అనుకోకుండా ఒక హీరోయిన్ కు సంబంధించిన పోస్ట్ లైక్ చేయడం ట్రెండింగ్ గా మారింది. ఆ తర్వాత అన్ లైక్ చేయడంతో దాని చుట్టూ కాంట్రవర్సీ మొదలైంది. చివరికి ఫ్యామిలీస్ ని కూడా ఈ వివాదంలోకి లాగే వరకు వచ్చింది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ కాంట్రవర్సీ ఏంటూ పూర్తిగా తెలుసుకుందాం.

కోహ్లీ ఇన్స్టా పేజ్ నుంచి అనుకోకుండా అవనీత్ కౌర్ అనే హీరోయిన్ పేజ్ లోని ఒక పోస్ట్ ను లైక్ చేశాడు. 2025 ఏప్రిల్ 30న కోహ్లీ లైక్ చేయడంతో ఆ హీరోయిన్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ తర్వాత మే 2న ఆ పోస్ట్ ను అన్ లైక్ చేసి.. ఇన్ స్టా ఆల్గారిథమ్ మిస్టేక్ వలన లైక్ చేసినట్లు అయ్యిందని, తాను కావాలని లైక్ చేయలేదని వివరణ ఇచ్చాడు కోహ్లీ. ఇదే సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. కోహ్లీ ఇచ్చిన వివరణపై నెటిజన్లు జోక్స్ చేస్తూ.. ఫన్నీ కామెంట్స్ పెడుతూ.. ఆ పోస్ట్ ను కోహ్లీ భార్య అనుష్క శర్మకు ట్యాగ్ చేశారు. 

సింగర్ రాహుల్ వైద్య వీడియోతో మరింత కాంట్రవర్సీ:


బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్య ఈ అంశంపై ఒక వీడియో చేసి పోస్ట్ చేశాడు. ‘‘కోహ్లీ నా అకౌంట్ బ్లాక్ చేశాడు. అయితే అతను కావాలని చేయలేదు. ఇన్ స్టా గ్లిట్చ్ వలన బ్లాక్ అయిపోయింది. నేను రాహుల్ అకౌంట్ బ్లాక్ చేస్తున్నాను అని ఇన్ స్టా కోహ్లీకి చెప్పి బ్లాక్ చేసి ఉంటుంది’’ అని వ్యంగ్యంగా వీడియో పోస్ట్ చేశాడు. 

అంతే కాదు.. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ.. ‘‘నేను కూడా అమ్మాయిల పోస్ట్ లు లైక్ చేసి కామెంట్స్ చేస్తా.. కానీ నా తప్పేం లేదు. ఎందుకంటే ఇన్ స్టా టెక్నికల్ ప్రాబ్లమ్ అని పెట్టేస్తా.. గమనించండి అమ్మాయిలూ..’’ అంటూ మరో పోస్ట్ చేశాడు. దీంతో పాటు కోహ్లీ ఫ్యాన్స్ ను ‘‘పనికిమాలిన జోకర్స్’’ అంటూ రాహుల్ కామెంట్స్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో అతిపెద్ద కాంట్రవర్సీ మొదలయ్యింది. 

►ALSO READ | Kiara Advani: చరిత్ర సృష్టించిన బ్యూటీ కియారా.. ఫస్ట్ టైం బేబీ బంప్‌తో మెట్ గాలా కార్పెట్‌పై.. ఫోటోలు వైరల్

ఫ్యాన్స్ ను పిచ్చోళ్లని సింగర్ రాహుల్ వైద్య కామెంట్ చేయడం.. కోహ్లీపై కామెడీ చేయడంపై ఫ్యాన్స్ మండి పడుతున్నారు. రాహుల్ భార్య, నటి దిశ పార్మర్ తో పాటు అతని చెల్లెలిని టార్గెట్ చేస్తూ ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. దీనిపై మండిపడిన రాహుల్.. ‘‘ మీరు నా భార్యను, చెల్లెలిని టార్గెట్ చేస్తున్నారు. దీనికి వారికి ఏంటి సంబంధం. అందుకే కోహ్లీ ఫ్యాన్స్ పనికి మాలిన జోకర్స్ అని అన్నాను. అది అక్షరాల నిజం’’ అని మరోసారి పోస్ట్ చేశాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. 

ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇదే కాంట్రవర్సీ నడుస్తోంది. కోహ్లీ ముందుకు వచ్చి ఈ వివాదాన్ని ముగించాలని నెటిజన్లు కోరుతున్నారు.