ప్రముఖ లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించందని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎస్పీబీ ఆరోగ్యంపై శుక్రవారం సాయంత్రం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై లైఫ్ సపోర్ట్ తో చికిత్స అందిస్తున్నామని.. బాలు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని ఎంజీఎం హాస్పిటల్స్ వైద్యులు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. నిన్న రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
