వైభవంగా సింగర్ సునీత పెళ్లి

వైభవంగా సింగర్ సునీత పెళ్లి

హైదరాబాద్: ప్రముఖ నేపధ్య గాయని సునీత, మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిల పెళ్లి వైభవంగా జరిగింది. నిన్నరాత్రి శంషాబాద్ సమీపంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరిగాయి. వీరి వివాహానికి హాజరై రాజకీయ, సినీ ప్రముఖలు అనేక మంది హాజరై ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధి మరియు  గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సునీత-రామ్ వీరపనేని జంటలతోపాటు.. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న హీరో నితిన్ – శాలినిల జంటను ఆశీర్వదించి, అభినందించారు. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న సింగర్ సునీతకు.. చాలా కాలం క్రితమే భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని.. పిల్లలతో కలసి వేరుగా ఉంటున్నారు. మరోవైపు మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనికి కూడా ఇది రెండో వివాహం. సినీ ప్రముఖులు, నిర్మాత దిల్ రాజు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు కొత్త జంటకు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. సునీత-రామ్ ల జంట బాగుందని అభినందిస్తూ ఫోటోలు షేర్ చేశారు.