తాగు, సాగు నీటికి కరువు లేకుండా చేసినం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తాగు, సాగు నీటికి కరువు లేకుండా చేసినం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో తాగు, సాగు నీటికి కరువు రాకుండా చేయడంలో సీఎం కేసీఆర్ విజయం సాధించారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఖిల్లా ఘనపురం మండలం గట్టుకాడిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

60 ఏండ్లుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు 41 రోజులు దీక్షతో పని చేసి పార్టీని గెలిపించాలని కోరారు. తనను మరోసారి గెలిపిస్తే వనపర్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.