ఉప్పల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్ .. రేవంత్ అనుచరులు రాజీనామా

ఉప్పల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్ .. రేవంత్ అనుచరులు  రాజీనామా

ఎన్నికల టైమ్  దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. చాలామంది అసంతృప్తి నేతలు పార్టీని వీడుతున్నారు.  తాజాగా మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్‌ కూడా పార్టీకి రాజీనామా చేయగా, ఆ పార్టీ సీనియర్ నేత,  మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. 

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉప్పల్ లో బిగ్ షాక్ తగలనుంది.  ఏఎస్ రావు నగర్  కార్పొరేటర్‌ శిరీష సోమశేఖర్‌ రెడ్డి ఆదివారం కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నారు. గ్రేటర్ లో రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్న సోమశేఖర్ రెడ్డి ఉప్పల్‌ టికెట్‌ ఆశించారు. కానీ పార్టీ కోసం కష్టపడినా న్యాయం జరగలేదంటూ  ఆవేదన వ్యకం చేశారు.