థియేటర్స్ నవ్వులతో నిండాయి.. ‘సింగిల్’ సక్సెస్ మీట్లో శ్రీ విష్ణు

థియేటర్స్ నవ్వులతో నిండాయి.. ‘సింగిల్’ సక్సెస్ మీట్లో శ్రీ విష్ణు

శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజు రూపొందించిన చిత్రం ‘సింగిల్’. కేతిక శర్మ, ఇవాన హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సమ్మర్ బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌కు దర్శకులు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, తిరుమల కిశోర్, హాసిత్ గోలి, వివేక్ ఆత్రేయ, రామ్ అబ్బరాజు హాజరై ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేశామని చెప్పారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘సినిమా బాగుంటే థియేటర్స్‌‌‌‌‌‌‌‌కి వస్తాము అని నిరూపించిన ఆడియెన్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యువ దర్శకులంతా వచ్చి ఈ సక్సెస్‌‌‌‌‌‌‌‌ని సెలబ్రేట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని అన్నారు.  శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘మంచి టీంతో చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ కొడితే బావుంటుందని అనుకున్నాను. అది జరిగింది.

హానెస్ట్‌‌‌‌‌‌‌‌గా సిన్సియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఏది చేసినా దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఈ సినిమా విజయం, అరవింద్ గారితో జర్నీ చాలా ఎంజాయ్ చేశాను. థియేటర్స్‌‌‌‌‌‌‌‌ అన్నీ నవ్వులతో నిండాయి.  ఈ సినిమాని ప్రేక్షకులు ఇంకా  చాలా రోజులు ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.  ఈ సినిమాని జీవితాంతం మర్చిపోలేను అని చిత్ర దర్శకుడు కార్తీక్ రాజు చెప్పాడు. ఈ సక్సెస్‌‌‌‌‌‌‌‌పై చాలా హ్యాపీగా ఉన్నామని నటీనటులు, నిర్మాతలు చెప్పారు.