పూటలో కొత్త గూటికి..‘ఓం శాంతి శాంతి శాంతి’ నుంచి పాట వచ్చేసింది

పూటలో కొత్త గూటికి..‘ఓం శాంతి శాంతి శాంతి’ నుంచి పాట వచ్చేసింది

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా ఎ.ఆర్ సజీవ్ రూపొందిస్తున్న  చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి:’. సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి కలిసి నిర్మిస్తున్నారు.  మంగళవారం ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. జయకృష్ణ కంపోజ్ చేసిన ఈ మెలోడీకి గాలి భరద్వాజ లిరిక్స్ రాశాడు. 

‘సిన్నదాన.. ఏందమ్మ  నీకీ  హైరానా.. సిన్నదైన సిక్కేదో ఉందా లోలోనా?.. పూటలో కొత్త గూటికి మారాలి అంటే  ఎట్టాగమ్మ.. గోతిలో నుంచి నూతికి నెడుతున్నా.. నవ్వేదెట్టగమ్మా.. అయినా నవ్వేశావే సక్కనమ్మా..’ అంటూ  పెళ్లి తర్వాత అప్పగింతల నేపథ్యంలో సాగే ఈ పాట ఆకట్టుకుంది.

జయ కృష్ణ, అనన్య భట్, ఎం.జి. నరసింహ వోకల్స్ పాటకు కొత్త  ఫీల్‌‌‌‌‌‌‌‌ని తీసుకొచ్చాయి.  ఇందులో  తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కెమిస్ట్రీని ప్రజెంట్ చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది.  మలయాళ చిత్రం ‘జయ జయ జయహే’కు ఇది తెలుగు రీమేక్.   బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  జనవరి 23న  విడుదల కానుంది.