కాళ్లతో 700కు పైగా కవితలు రాసిన సిరిసిల్ల రాజేశ్వరి ఇకలేరు

కాళ్లతో 700కు పైగా కవితలు రాసిన సిరిసిల్ల రాజేశ్వరి ఇకలేరు

అంగవైకల్యాన్ని ఎదురించి, తన కవితలతో సిరిసిల్ల రాజేశ్వరిగా పేరుగాంచిన కవయిత్రి బూర రాజేశ్వరి కన్నుమూశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని తన ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. దివ్యాంగురాలైన .. ఆ యువతి కాళ్లతో ఎన్నో కవితలు రాసింది. ఆమె కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి. నడవలేని స్థితిలో కూడా మంచానికే పరిమితమై.. తన భావాలను, మనుసులో ఉన్న బాధలను కవితల రూపంలో 500కు పైగా కవితలు రాసి ఈ లోకాన్ని ఆకర్షించింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల రాజేశ్వరి ప్రతిభను మెచ్చి రూ.10 లక్షలు ప్రభుత్వం తరపున ఫిక్స్డ్ చేయించారు. నెల నెల రూ.10 వేల పెన్షన్ ఇస్తున్నారు. రాజేశ్వరి ఉండటానికి ఒక డబుల్ బెడ్ రూంను కూడా కేసీఆర్ కాలనీలో కేటాయించారు.

రాజేశ్వరికి చేతులు సహకరించకపోయినా కాళ్లతోనే కవితలు రాసేది. కొన్ని సంస్థల నుంచి ఎన్నో పురస్కారాలు అందుకుంది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమె ప్రతిభను గుర్తించింది. విద్యార్ధులకు ఆదర్శంగా ఉండాలని.. 12 తరగతి తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చింది. దివ్యాంగురాలైనప్పటికి ఆత్మవిశ్వాసంతో ఆమె ఎందరికో స్పూర్తిగా నిలిచింది.1999 నుంచే రాజేశ్వరి కవితలు రాస్తోంది. ఇంటర్మీడియర్ వరకు చదువుకున్న రాజేశ్వరి.. పుట్టుకతోనే దివ్యాంగురాలు. అంగవైకల్యాన్ని అధిగమిస్తూ కాలుతో కవిత్వాన్ని రాసిన రాజేశ్వరి కవిత్వం పుస్తకరూపంలో వచ్చింది. సిరిసిల్ల రాజేశ్వరి రచనల పేరుతో పుస్తకం వచ్చింది. 

అమ్మ, తెలంగాణ ఉద్యమం, నేత కార్మికులు, వరకట్న వేధింపులు, అత్యాచారాలు, ఆత్మవిశ్వాసం, స్నేహం, జీవితంతో పాటు సామాజిక అంశాలపై రాజేశ్వరి కవితలు రాసింది. సాహిత్యానికి అంగవైకల్యం అడ్డురాదని నిరూపించింది. వైకల్యంతో చేతులు పనిచేయకపోయినా, కాళ్లతో కలాన్ని పట్టి 700 పైగా కవితలు రాసి ఎంతో మంది నుంచి రాజేశ్వరి ప్రశంసలు అందుకుంది.