'మున్సిపల్ వద్దు... గ్రామపంచాయతీ ముద్దు'..

'మున్సిపల్ వద్దు... గ్రామపంచాయతీ ముద్దు'..

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాల ఓటర్లు అధికార పార్టీపై చిట్టిలతో నిరసన తెలిపారు. తమ గ్రామాలను బలవంతంగా మున్సిపాలిటీలో వీలినం చేశారంటూ ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. సిరిసిల్ల సెస్ ఎన్నికల పోలింగ్ లో 'మున్సిపల్ వద్దు.. గ్రామపంచాయతీ ముద్దు' అంటూ ఓటర్లు చిట్టిలపై రాసి బ్యాలెట్ పేపర్ తో పాటు బాక్సులో వేసి నిరసన తెలిపారు. ఇవాళ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆ చిట్టీలు బయటపడ్డాయి. దీంతో అధికార పార్టీ మెజార్టీపై విలీన గ్రామాల ఓటర్ల ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడ్డాయి.

సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. జిల్లాల్లో 12 స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్ లో ఉండగా.. సిరిసిల్ల టౌన్ 1, వేములవాడ రూరల్ మండలంలో బీజేపీ లీడ్ లో కొనసాగుతోంది. వేములవాడ అర్బన్ మండలంలో కాంగ్రెస్ ముందజలో ఉంది. 15 స్థానాల్లో 75 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వేములవాడ పట్టణాల్లో ఉన్న 87,130 మంది ఓటర్లకు గాను 73,189 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.