అప్పట్లో పెద్ద సంచలనం : శిరీష్ భరద్వాజ్ కన్నుమూత

అప్పట్లో పెద్ద సంచలనం : శిరీష్ భరద్వాజ్ కన్నుమూత

శిరీష్ భరద్వాజ్ కన్నుమూశాడు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. లంగ్స్ డ్యామేజ్ కావటంతో కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ 2024, జూన్ 18వ తేదీ రాత్రి చనిపోయినట్లు తెలుస్తుంది. 

శిరీష్ భరద్వాజ్ గతంలో మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో పెద్ద వివాదం జరిగింది. వీరి ప్రేమ పెళ్లికి గుర్తుకు వీరికి ఓ కుమార్తె ఉన్నది. కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో శిరీష్ భరద్వాజ్ పెద్ద సంచలనం అయ్యారు. 

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజకు విడాకులు ఇచ్చిన తర్వాత.. శిరీష్ భరద్వాజ్ మరో పెళ్లి చేసుకున్నారు. 2014లో చిరంజీవి చిన్న కుమార్తెతో విడాకుల తర్వాత.. 2019లో శరీష్ భరద్వాజ్ హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విహనను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ పార్టీలో చేరారు. ఇప్పటి ప్రధాని మోదీని.. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కలిశారు కూడా.