
మాదాపూర్, వెలుగు: అక్కాచెల్లెళ్ల భరతనాట్య అరంగేట్ర నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో శుక్రవారం భరతనాట్య గురువు సంతోష్‌కుమార్ తమంగ్ పర్యవేక్షణలో కొత్తకాపు హర్షిత రెడ్డి, కొత్తకాపు రుచితారెడ్డి భరతనాట్య ప్రదర్శనతో మరిపించారు.
షణ్ముఖ కౌత్వం, అలరిపు, జతిస్వరం, శబ్ధం, పదవర్ణం, నటనం, ఆడినార్, రామచంద్ర భజన, తిల్లాన అంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో హర్షిత, రుచిత తల్లిదండ్రులు గాయత్రి, జగన్మోహన్రెడ్డి, భరతనాట్య గురువు డాక్టర్ ఇందిరా హేమ, కూచిపూడి గురువు డాక్టర్ విజయపాల్ పతోత్, వోకల్స్ జయకుమార్ భరద్వాజ పాల్గొన్నారు..