BRS పార్టీకి వచ్చిన విరాళాలపై సిట్ ఫోకస్

BRS పార్టీకి వచ్చిన విరాళాలపై సిట్ ఫోకస్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. శుక్రవారం (జనవరి 23) ఉదయం 11 గంటల నుంచి జూబ్లీహిల్స్ పీఎస్‎లో సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో అధికారులు ఇంటరాగేట్ చేస్తున్నారు. పలు అంశాలకు సంబంధించి కేటీఆర్‎పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తోన్నట్లు తెలిసింది. 

ముఖ్యంగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‎ పార్టీకి వచ్చిన విరాళాలపై సిట్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు 2023 ఎన్నికల సమయంలో వచ్చిన విరాళాల పూర్తి వివరాలు ఇవ్వాలని సిట్ కేటీఆర్‎ను కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

ఎన్నికల సమయంలో ఎన్ని ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి.. బాండ్స్ రూపంలో ఎన్ని మొత్తం కోట్ల విరాళాలు వచ్చాయని సిట్ అడిగినట్లు సమాచారం. అలాగే, 2023 ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారా..? సినీ ప్రముఖులు, హీరోయిన్స్ ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాలతో జరిగాయి..? అని సిట్ ఆఫీసర్స్ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. 

సిట్ అడిగినవాటిలో కొన్ని ప్రశ్నలు..!

  • పార్టీ ఆర్థిక లావాదేవీలపై ఎంత మేర అవగాహన ఉంది..?
  • వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చెక్ పవర్ ఉందా..? 
  • ఎలక్టోరల్ బాండ్స్ ఎన్ని వచ్చాయి..?
  • బాండ్స్ రూపంలో ఎన్ని కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి..?
  • సంధ్య శ్రీధర్ రావు ద్వారా 12  కోట్ల రూపాయలు బాండ్స్?
  • బ్లాక్ మెయిల్ చేసి బాండ్స్ వసూలు చేశారా?
  • 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో వార్ రూమ్ ఎందుకు..?
  •  సిరిసిల్ల వార్ రూమ్ నుంచే ఫోన్ ట్యాపింగ్ చేశారా..?
  • రియల్ ఎస్టేట్, ఫార్మా వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారా?
  • ఇజ్రాయిల్ సాఫ్ట్‌వేర్‌తో ట్యాపింగ్..?
  • ఆ సాఫ్ట్‌వేర్ కోసం BRS ఖాతా నుంచి డబ్బులు వెళ్లాయా..?
  • ఛానెల్ MD శ్రవణ్ రావుతో సంబంధాలేంటి..?
  • ఛానెల్ వార్ రూమ్‌లో ఏం జరిగింది..?
  • 2023 ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారా?
  •  ప్రణీత్–ప్రభాకర్–రాధాకిషన్‌తో రహస్య కమ్యూనికేషన్ ఏంటి..?
  • వాట్సాప్, సిగ్నల్ యాప్‌లలో ఎన్నికల సమయంలో ఎందుకు మాట్లాడారు..?
  • సినీ ప్రముఖులు, హీరోయిన్స్ ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాలతో జరిగాయి..?

  •