
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేట లాయర్ ప్రతాప్ గౌడ్ కు 41 సీఆర్పీసి కింద నోటీసులు ఇచ్చింది. ఇవాళ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన సిట్.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ డాక్టర్ జగ్గుస్వామి, భారతీయ ధర్మజనసేన చీఫ్ తుషార్,కరీంనగర్ లాయర్ శ్రీనివాస్ లకు నోటీసులు ఇచ్చింది. వీరిలో లాయర్ శ్రీనివాస్ మినహా మిగతా వాళ్లు సిట్ విచారణకు హాజరుకాలేదు. వీళ్ల విచారణ ప్రక్రియ జరుగుతుండగానే ఇవాళ సిట్ మరో ఇద్దరికి నోటీసులిచ్చింది.
ఇవాళ నిందితుల పోలీస్ కష్టడి పిటిషన్ ను ఏసీబీ కోర్ట్ మరోసారి విచారించనుంది. నందకుమార్, సింహయాజి, రామచంద్ర భారతిని వారంపాటు కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ పై నిన్న వాదనలు జరిగాయి. దీనిపై నిందితుల తరపు అడ్వకేట్లు కౌంటర్ దాఖలు చేశారు . గతంలో రెండ్రోజుల పాటు విచారించినా పూర్తి వివరాలు రాలేదని.. మరో వారంపాటు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో.. విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.