TSPSC : పేపర్ లీక్ కేసులో స్పీడ్ పెంచిన సిట్

TSPSC : పేపర్ లీక్ కేసులో స్పీడ్ పెంచిన సిట్

టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ కేసులో సిట్ రంగంలోకి దిగింది.  సిట్ చీఫ్ ఏఆర్. శ్రీనివాస్  బేగంబజార్ పోలీస్  స్టేషన్ కు వెళ్లారు. పేపర్  లీక్ కేసులో బేగంబజార్ ఇన్ స్పెక్టర్ , ఏసీపీల దగ్గర నుంచి వివరాలను సేకరించారు.  పేపర్ లీకేజీపై  సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఇద్దరికి మాత్రమే పేపర్ లీక్ అయినట్లు  గుర్తించామని తెలిపారు. నిందితుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు ఎఫ్ఎస్ఎల్ కు పంపించామని చెప్పారు.   ఎఫ్ఎస్ ఎల్ నివేదిక  వచ్చాక పూర్తి స్థాయి దర్యాప్తు ఉంటుందని వెల్లడించారు. నిందితులు ఎంతటి వాళ్లైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మార్చి 14న ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు  ఈ  కేసులో 9 మంది నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.  పోలీసులు  8 మంది నిందితులను చర్లపల్లి జైలుకు,  మరో నిందితురాలు రేణుకను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు.