నాన్న పాటకి సితార పాప డ్యాన్స్.. ఎంత క్యూట్గా చేసిందో చూడండి!

నాన్న పాటకి సితార పాప డ్యాన్స్.. ఎంత క్యూట్గా చేసిందో చూడండి!

మహేష్ బాబు(Mahesh Babu) గారాల పట్టి సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటారు. తన డాన్స్ వీడియోలు ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు. ఇటీవల ప్రముఖ జెవెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా కూడా చేశారు. ఆ యాడ్ న్యూయార్క్ లోకి టైం స్క్వేర్ లో టెలికాస్ట్ అయ్యి ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యారు సితార.

ఇదిలా ఉంటే మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు సితార. తండ్రి మహేష్ హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాలోని పాటకు క్యూట్ గా స్టెప్స్ వేశారు. ఆ సినిమాలోని ట్రిప్పింగ్..ట్రిప్పింగ్.. అంటూ సాగే మెలోడీ సాంగ్ కి డాన్స్ వేసి ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు సితార. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోందో. ఇది చూసిన మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. డాన్స్ చాలా క్యూట్ గా చేశారు సితార.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. అయినప్పటికి బాక్సాఫిస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. విడుదలైన వారంరోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూలు రాబట్టి రీజనల్ మూవీస్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.