- సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి
చేర్యాల, వెలుగు:సీపీఎం ఆల్ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పార్టీకి తీరనిలోటని జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌వద్ద ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామ్రేడ్ సీతారం స్టూడెంట్దశ నుంచి ఇప్పటివరకు విరామం లేకుండా ప్రజల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో వెంకటమావో, యాదగిరి, అరుణ్‌కుమార్, శ్రీహరి, ప్రభాకర్, యాదగిరి, రంజిత్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, శ్రీధర్, నూర్బి పాల్గొన్నారు.
సీతారాం మరణం బాధకు గురిచేసింది: ఎమ్మెల్యే పల్లాసీతారాం ఏచూరి మరణం బాధకు గురిచేసిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశలోనే వామపక్ష భావజాలానికి ఆకర్షితులవడానికి తనకు ఆయనే స్ఫూర్తిదాత అన్నారు. కామ్రేడ్ సీతారాంకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు.