
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ శనివారం ( సెప్టెంబర్ 21) రవీంద్రభారతిలో సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడారు.
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీతారాం ఏచూరికి నివాళి అర్పించారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని ఈ రోజుల్లో సీతారాం ఏచూరి ఒకే పార్టీలో ఉన్నారని... ఉన్నత కుటుంబంలో పుట్టి.. అణగారిన వర్గాల వారి కోసం సీతారాం ఏచేరి పోరాడారని కేటీఆర్ అన్నారు. సీతారాం ఏచూరి జీవితం మా లాంటి యువనాయకులకు ఆదర్శమని కేటీఆర్ అన్నారు. పార్టీలు వేరయినా... సిద్దాంతాలు వేరయినా.. ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మాది రక్త సంబంధమంటూ.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నపుడు మౌనంగా ఉండటం ప్రమాదకరమన్నారు. రాజ్యాంగం అపహాస్యం అయినా ప్రతిసారి మేం ప్రశ్నించామన్నారు.
మేమిద్దరం కలిసి చదువుకున్నాం: ఎమ్మెల్సీ కోదండరాం
ఈ సభలో ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. తాను,సీతారాం జేఎన్ యూలో చదువుకున్నామని ..అక్కడే వారితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఇందిరాగాంధీ యూనివర్శిటీకి వీసీ గా ఉన్నారని.. ఆమె రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చామన్నారు. ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి.. ఎత్తివేసిన తరువాత కాలేజీలో చేరామన్నారు. ఏచూరికి హైదరాబాద్ లోనే వామ పక్ష భావాలు ఉండేవని.. ఆయన మూడు సార్లు జేఎన్ యూ అధ్యక్షులుగా పనిచశారని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. క్యాంపస్ లో విద్యార్యుల అణచివేత ఉండొద్దని పోరాటం చేశారు సెక్యూలర్ ప్రజాస్వామిక విలువలు కాపాడటానికి అన్ని పార్టీలను ఏకం చేయడానికి ఏచూరి ఎంతో కృషి చేశారని తెలిపారు.