LSG vs SRH: 7 పరుగులకే పంత్ ఔట్.. కోపంతో బాల్కనీ నుంచి వెళ్లిపోయిన సంజీవ్ గోయెంకా

LSG vs SRH: 7 పరుగులకే పంత్ ఔట్.. కోపంతో బాల్కనీ నుంచి వెళ్లిపోయిన సంజీవ్ గోయెంకా

ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ ల్లో కేవలం 1 యావరేజ్ తో 132 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. సోమవారం(మే 19) సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. కేవలం 7 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. 6 బంతుల్లో 7 పరుగులు చేసిన లక్నో కెప్టెన్.. ఇషాన్ మలింగా పట్టిన అద్భుతమైన రిటర్న్ క్యాచ్ కు ఔటయ్యాడు. ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో జట్టును ముంచేశాడు. 

పంత్ ఔట్ కావడంతో లక్నో సూపర్ జయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా  తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఔటైన వెంటనే లేచి కోపంతో బాల్కనీ ధాటి వెళ్ళిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రూ. 27 కోట్ల రికార్డ్ ధరకు లక్నో తీసుకుంటే ఘోరంగా బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. చూస్తుంటే పంత్ తన మీద తనకు కాన్ఫిడెంట్ పోయిందేమో అనే అనుమానం కలగక మానదు. ఈ మ్యాచ్ లో లక్నో ఓడిపోతే  పంత్ విమర్శలు మూటగట్టుకోవాల్సిందే.

ALSO READ | KL Rahul: మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ: టీమిండియా టీ20 జట్టులో రాహుల్.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు

 ఈ  మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ చేసి బౌలర్లపై భారం వేసింది. ఓపెనర్లు మార్కరం(38 బంతుల్లో 61:4 ఫోర్లు, 4 సిక్సర్లు), మిచెల్ మార్ష్(39 బంతుల్లో 65:6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు.. పూరన్ మెరుపులు (45) మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. మార్ష్ (65) టాప్ స్కోరర్ గా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్లలో మలింగా రెండు.. హర్ష దూబే, హర్షల్ పటేల్, నితీష్ రెడ్డి తలో వికెట్ తీసుకున్నారు.