సర్కార్ దవాఖానలో మహిళా జడ్జి కాన్పు

సర్కార్ దవాఖానలో మహిళా జడ్జి కాన్పు

వేములవాడ, వెలుగు: సర్కార్ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెంచేలా మహిళా జడ్జి నార్మల్ డెలివరీ చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టు జూనియర్​ సివిల్​జడ్జి జ్యోతిర్మయి సోమవారం మగబిడ్డకు జన్మనిచ్చారు.

2023లో వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారి కూతురికి, మళ్లీ రెండోకాన్పులో అదే ఆస్పత్రిలో కుమారుడికి జన్మనిచ్చి.. మహిళలకు ఆదర్శంగా నిలిచారు.  సీనియర్ కోర్టు ఏజీపీ బొడ్డు ప్రశాంత్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ రవి, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.