UAE vs BAN: బంగ్లాదేశ్‌పై యూఏఈ చారిత్రాత్మక విజయం.. భారీ ఛేజింగ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ

UAE vs BAN: బంగ్లాదేశ్‌పై యూఏఈ చారిత్రాత్మక విజయం.. భారీ ఛేజింగ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమన దేశ క్రికెట్ లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. పటిష్ట బంగ్లాదేశ్ కు షాకిచ్చి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో యూఏఈ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. సోమవారం (మే 19) షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్ లో యూఏఈ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి గెలిచింది. 

ALSO READ | IPL 2025: పంజాబ్, గుజరాత్‌కు బంపర్ ఛాన్స్.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ వేదికలు ఇవే!

206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు ముహమ్మద్ జోహైబ్, ముహమ్మద్ వసీం 10.1 ఓవర్లలోనే 107 పరుగులు జోడించి జట్టుకు పటిష్ట స్థితిలో ఉంచారు. 38 పరుగులు చేసి జోహైబ్ ఔటైనా.. ముహమ్మద్ వసీం ముంది జట్టును నడిపించాడు. ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ జట్టును విజయ తీరాలను చేర్చాడు. 42 బంతుల్లోనే 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో వసీం ఔటైనా.. ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించారు. 

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. తంజిద్ హసన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. తోహిద్ హ్రిడోయ్, లిటన్ దాస్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ ల సిరీస్ ను 1-1 తో సిరీస్ సమం చేసింది. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే బుధవారం (మే 21) జరుగుతుంది.