
హైదరాబాద్, వెలుగు: సితారే గోల్డ్ అండ్ డైమండ్స్ హైదరాబాద్‌లోని తన తొలి షోరూమ్‌ను చందనగర్‌లో ఆదివారం ప్రారంభించింది. 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ షోరూమ్‌లో బంగారం, వజ్రాలు, ప్లాటినం, అన్‌కట్, రత్నాభరణాలను అమ్ముతారు. షోరూమ్ ప్రారంభానికి సినీ నటి సంయుక్త మీనన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిధులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హాజరయ్యారు. ప్రారంభోత్సవం సందర్భంగా 30 శాతం డిస్కౌంట్‌ను సంస్థ ప్రకటించింది.