
హైదరాబాద్: మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్పష్టం చేశారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుత్బుల్లాపూర్, మేడ్చల్ సెగ్మెంట్ల నుంచి పోటీ చేయనున్నట్టు వదంతులు వ్యాపింప జేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మైనంపల్లిని కలిసేందుకు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి రావడంతో సందడి నెలకొంది.
ఈ సందర్భంగా మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. తనకు పదవులు ముఖ్యం కాదని, కార్యకర్తలే ప్రధానమని చెప్పారు. వాళ్ల కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడబోనని అన్నారు. తమ కోసం బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.