శివకార్తికేయన్ అమరన్ మూవీ టీజర్ రిలీజ్

శివకార్తికేయన్ అమరన్ మూవీ టీజర్ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ యాక్షన్‌‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ హీరో శివకార్తికేయన్. తను హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌‌ మూవీ రీసెంట్‌‌గా మొదలైంది. మరోవైపు సోనీ పిక్చర్స్‌‌తో కలిసి కమల్ హాసన్‌‌ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్‌‌ మూవీలోనూ నటిస్తున్నాడు. రాజ్ కుమార్ పెరియసామి దీనికి దర్శకుడు. సాయిపల్లవి హీరోయిన్‌‌.

శివకార్తికేయన్‌‌ కెరీర్‌‌‌‌లో ఇది 21వ చిత్రం. తన పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ, శుక్రవారం ఈ మూవీ టైటిల్‌‌ను అనౌన్స్ చేశారు. ‘అమరన్‌‌’ అనే టైటిల్‌‌ను ఫిక్స్ చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌తో కట్ చేసిన ఈ టీజర్‌‌‌‌లో శివకార్తికేయన్‌‌ ఆర్మీ సోల్జర్‌‌‌‌గా పవర్‌‌‌‌ఫుల్‌‌ క్యారెక్టర్‌‌‌‌లో కనిపించాడు. కాశ్మీర్‌‌‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఇండియన్‌‌ ఆర్మీ, టెర్రరిస్టుల మధ్య వార్‌‌‌‌ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది. గ్రాండ్‌‌ విజువల్స్‌‌తో పాటు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఆకట్టుకున్నాయి.