
హీరో శివకార్తికేయన్, డాన్' దర్శకుడు సిబి చక్రవర్తి మరోసారి కలిసి పనిచేయనున్నారు. ఈ కాంబోలో మూవీ రానుందని ఏడాది కాలంగా వినిపిస్తుంది. అయితే, లేటెస్ట్ ఓ ఇంటర్వ్యూలో శివకార్తికేయన్ క్లారిటీ ఇస్తూ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వివరాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా తన కెరియర్లో సూపర్‌డూపర్ హిట్ అందించిన డాన్ దర్శకుడు సిబి చక్రవర్తితో మూవీ ఉంటుందని శివకార్తికేయన్ వెల్లడించాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘నా నెక్స్ట్ మూవీ సిబి చక్రవర్తితో కలిసి చేస్తున్నాను. ఆ సినిమా ఎలా వస్తుందో చూడాలని ఆసక్తిగా ఉన్నాను. అదే నా తదుపరి ప్రాజెక్ట్. దాని తర్వాత గోట్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ సినిమా ఉంటుందని’ శివకార్తికేయన్ తెలిపారు.
అలాగే, తమిళ సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేద’ దర్శక ద్వయం ‘పుష్కర్-గాయత్రి’తో ఒక సినిమా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని.. లైనప్ గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నానని‘ శివకార్తికేయన్ అన్నారు. డైరెక్టర్ సిబి డాన్‌తో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి కోలీవుడ్‌లో రికార్డ్ సెట్ చేశాడు. ఈ క్రమంలోనే శివ కార్తికేయన్-సిబి కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా, శివకార్తికేయన్ (సెప్టెంబర్5న) మదరాసి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు మిక్సెడ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోతుంది. AR మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ ముగిసేలోపు రూ.60 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లతో కొనసాగుతుంది. త్వరలో వందకోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియా వైడ్గా మదరాసి రూ.42 కోట్లకి పైగా నెట్ వసూళ్లతో దూసుకెళ్తుంది. చూడాలి మరి మదరాసి బాక్సాఫీస్ భవిష్యత్తు ఏంటనేది! ఇకపోతే, శివకార్తికేయన్ అప్ కమింగ్ రిలీజ్ మూవీ పరాశక్తి (SK25). సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీ 2026 పొంగల్‌కు విడుదల కానుంది.