కాంగ్రెస్ అభ్యర్థి విజయం తథ్యం

కాంగ్రెస్ అభ్యర్థి విజయం తథ్యం
  •     కాంగ్రెస్​లో భారీగా చేరికలు

మరికల్​, వెలుగు :  నారాయణపేట కాంగ్రెస్​ అభ్యర్థి పర్నికారెడ్డి విజయం తథ్యమని డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్​ నేత సత్యనారాయణ నేతృత్వంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్టాడుతూ  అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్​ పార్టీయేనని అన్నారు.

కార్యక్రమంలో  పార్టీ మండలాధ్యక్షులు వీరన్న, గొల్ల కృష్ణయ్య, హరీశ్​కుమార్, చెన్నయ్య, అంజిరెడ్డి, మొగులయ్య, టైసన్, రఘు, మల్లేశ్, జంగిడి ఆంజనేయులు, పలువురు పాల్గొన్నారు. 


ఆమనగల్లు, వెలుగు:  కల్వకుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ఇన్ చార్జి చీమల అర్జున్ రెడ్డి ఆ పార్టీ నాయకులతో కలిసి సోమవారం కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో ఎమ్మెల్సీ స్వగృహంలో కాంగ్రెస్ లో చేరారు. అనంతరం అర్జున్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి  కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తానని చెప్పారు.

 కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ 

అడ్డాకుల, వెలుగు :  మహబూబ్​నగర్ జిల్లా మూసాపేట మండలంలోని వేముల గ్రామ మాజీ సర్పంచ్ రేవంతమ్మతోపాటు ముదిరాజ్ సంఘం నాయకులు సోమవారం దేవరకద్ర నియోజకవర్గ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.