ప్రవళిక అత్యహత్య కేసులో శివరామ్ అరెస్ట్ .. కోర్టు వద్దనే అదుపులోకి తీసుకున్న పోలీసులు  

ప్రవళిక అత్యహత్య కేసులో శివరామ్ అరెస్ట్ .. కోర్టు వద్దనే అదుపులోకి తీసుకున్న పోలీసులు  

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రూప్‌‌1 అభ్యర్థి మర్రి ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్‌‌ రాథోడ్‌‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్‌‌స్టేషన్‌‌కు తరలించారు. విచారణ అనంతరం అతడిని శనివారం కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే, శివరామ్‌‌ అరెస్ట్‌‌కు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. శివరామ్‌‌ పోలీసులకు చిక్కకుండా శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.

తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్‌‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌‌పై కోర్టు విచారణ జరిపింది. శివరామ్‌‌ సరెండర్‌‌‌‌ను జడ్జి తిరస్కరించారు. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించారు. దీంతో కోర్టు హాల్‌‌ నుంచి బయటకు వచ్చిన శివరామ్‌‌ను చిక్కడపల్లి పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీస్ స్టేషన్‌‌కు తరలించి విచారిస్తున్నారు.