ఉమేష్ కొల్హే ఘటనలో ఆరుగురు అరెస్ట్

ఉమేష్ కొల్హే ఘటనలో ఆరుగురు అరెస్ట్

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ ఘటనను మరవకముందే అటువంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో నుపుర్​ శర్మకు మద్దతుగా పోస్ట్ చేసిన మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. మహారాష్ట్ర అమరావతికి చెందిన ఫార్మసిస్ట్ ఉమేష్ కొల్హే.. నుపుర్​ శర్మకు మద్దతుగా ఫేస్బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో కొంతమంది దుండగులు ఉమేష్ కొల్హేను దారుణంగా హత్యచేశారు. ఈ కేసును కూడా హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించింది.

ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు అమరావతి డీసీపీ విక్రమ్ తెలిపారు. నుపుర్​ శర్మకు మద్దతుగా ఉమేష్ కొల్హే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారని, దాని వల్లే ఈ హత్య జరిగినట్లు గుర్తించామని వెల్లడించారు.