బీహార్లో పట్టాలు తప్పిన నార్త్‌ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌.. నలుగురు మృతి

బీహార్లో పట్టాలు తప్పిన నార్త్‌ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌.. నలుగురు మృతి

బీహార్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ నుంచి అస్సాంలోని కామాఖ్యాకు వెళ్తున్న నార్త్‌ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు బీహార్‌లోని రఘునాథ్‌పుర్‌ స్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం (అక్టోబర్​ 11వ తేదీ) రాత్రి 9 గంటల 35 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రైలు ప్రమాదం జరగడంతో రైల్వేశాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. పట్నా: 9771449971, ధన్‌పూర్‌: 8905697493, కమాండ్‌ కంట్రోల్‌: 7759070004, ఆరా : 8306182542 హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులో ఉంచింది.

రైలు ప్రమాదంపై బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్‌ఎఫ్‌కు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖకు సూచించారు. కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్‌ చౌబే కూడా రైలు ప్రమాదంపై స్పందించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ఘటనాస్థలికి పంపించామని, క్షతగాత్రులను పట్నాలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.