జ్యోతిష్యం : ఈ ఆరు నక్షత్రాల వాళ్లపై ఈర్ష్య, అసూయ ప్రభావం ఎక్కువగా ఉంటుంది..!

జ్యోతిష్యం : ఈ ఆరు నక్షత్రాల వాళ్లపై ఈర్ష్య, అసూయ ప్రభావం ఎక్కువగా ఉంటుంది..!

 జ్యోతిష్యశాస్త్రంలో  27 నక్షత్రాలకు.. నవగ్రహాలకు.. 12 రాశులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మందికి  నక్షత్రాల చరిత్ర గురించి చాలా మందికి తెలియదు..  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  ఆరు నక్షత్రాల వాళ్లపై ( రోహిణి, చిత్త,పూర్వ ఫల్గుణి  స్వాతి ,అనురాధ,రేవతి)  ఈర్ష్య, అసూయ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 

ఈ ఆరు నక్షత్రాల్లో జన్మించిన వారు ప్రత్యేకంగా కనిపించేందుకు ప్రయత్నించరు.  కాని వీరిపై ఆకర్షణ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది.  అయిస్కాంతం .. ఇనుమును ఆకర్షించిన విధంగా..వీరిపై జనాల అసూయ .. ఈర్ష్య ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.దీనితో ప్రశంశలు కూడా లభించి తీవ్రమైన శక్తిని కలిగి ఉంటారు. 

రోహిణి : ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు.  ఈ నక్షత్రంలో జన్మించిన వారు  ఆనందంతో జీవిస్తారు. చాలా ప్రశాంతంగా ఉండి.. జనాలను ఆకర్షిస్తుంటారు.  వీరిపై చెడు దృష్టి ప్రభావం ఎక్కువుగా ఉండటంతో ఇతరులలో అసూయ కలుగుతుంది. 

చిత్త  : ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు .. అద్భుతమైన రూపం...  కళాత్మక నైపుణ్యం ... ధైర్యమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.  ఈ నక్షత్రంలో పుట్టిన వారు సహజంగా విశ్వాసం  ఎక్కువుగా కలిలిగి ఉంటారు.  వీరు చాలా మంచి శరీరం, ఆకృతి, ఆకర్షణీయమైన లక్షణాలు.. అందమైన  కళ్ళు కలిగి ఉంటారు. ప్యాషన్​.. సృజనాత్మకత..  సౌందర్యం పట్ల ఆకర్షితులవుతారు.  ఎక్కువుగా సైలంట్​ గా ఉండేందుకు ఇష్టపడతారు.  వీరి నిశ్శబ్దాన్ని ఇతరులు జీర్ణించుకోలేరు.  వీరిని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు.  వీరిపై నరదృష్టి.. అసూయ ప్రభావాలు ఎక్కువుగా ఉంటాయి. 

పూర్వ ఫాల్గుణి : ఈ నక్షత్రాని అధిపతి శుక్రుడు.  ఈ నక్షత్రంలో జన్మించిన వారు  ప్రతికూల ... కళాత్మక  ... గొప్ప  స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి  మాటలతో  ఇతరులకు  వ్యూహాత్మకంగా  ఆకట్టుకుంటారు.  వీరి వ్యక్తిత్వం.. ముక్కుసూటిగా వ్యవహరించడం కొంతమందికి ఇబ్బంది కలిస్తుంది.  వీరి పట్ల ఇతరులు చూపే ఆదరణ... అభిమానాలను కొంతమంది ఓర్చుకోలేక పోవడంతో ద్వేషం పెంచుకుంటారు. 

స్వాతి: ఈ నక్షత్రానికి అధిపతి రాహువు.  ఈ  నక్షత్రంలో జన్మించిన వారు ప్రశాంతంగా ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు.  వీరి ఆలోచన ప్రత్యర్థులకు ఇబ్బంది కలిగేలా ఉంటుంది.రు పూర్తిగా  గొప్ప స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు. 

అనురాధ : ఈ నక్షత్రానికి అధిపతి శని .  ఈ నక్షత్రంలో జన్మించిన వారు లోతైన కళ్లు కలిగి ఉంటారు.  సహజంగా వీరు నిశ్శబ్దంగా ఉండి భావోద్వేగాన్ని కలిగి ఉంటారు. వీరిలో ఎక్కువుగా దైవభక్తి ఉంటుంది. 

రేవతి :ఈ నక్షత్రానికి అధిపతి  బుధుడు.  ఈ నక్షత్రంలో జన్మించిన వారు  కరుణ ...  ప్రశాంతతను కలిగి ఉంటారు. వీరి సున్నితమైన స్వభావం..  అంతర్గతంగా శాంతి,  ప్రేమ ,  గౌరవాన్ని ఆకర్షిస్తాయి.  వీరి ప్రతి విషయంలో స్పష్టమైన నిర్ణయం..  స్వచ్ఛత  కలిగి ఉండటంతో..ఒక్కోసారి  ఇతరులు వీరిపై అసూయ పడతారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.