గాలివానలో పడవ బోల్తా.. ఆరుగురు మృతి

గాలివానలో పడవ బోల్తా.. ఆరుగురు మృతి

పూణెలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈదురు గాలులు, భారీ వర్షాలు యమపాషంగా మారాయి. వీటి వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని ఉజని డ్యామ్ బ్యాక్ వాటర్ లో పడవ బోల్తా పడింది. మంగళవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా డ్యామ్ లో ప్రయాణిస్తున్న బోట్ ఈ ప్రమాదానికి గురైంది. ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు బుధవారం (మే 22) తెలిపారు. 

ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఇద్దరు పిల్లలు మొత్తం ఆరుగురు చనిపోయారని ఇందాపూర్ తహసీల్దార్ శ్రీకాంత్ పాటిల్ తెలియజేశారు. కలాషి నుంచి భుగవ్ గ్రామాల మధ్య బోట్ సర్వీస్ నడుపుతున్నారు. మంగళవారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులు, వర్షం కారణంగా ఏడుగురితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడిందని ఆయన చెప్పారు. బోటులో ఉన్న ఏడుగురిలో ఒకరు అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆఫీసర్ ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు.