
ఐదున్నర కిలో మీటర్ల మీదున్న ఎవరెస్టు బేస్ క్యాంప్. ఫిట్ గా ఉన్న పెద్దోళ్లకే ఎక్కుడు కష్టం. కానీ ఆరేళ్ల బాలిక అలవోకగా ఎక్కేసింది. అతి చిన్న వయసులో ఎవరెస్టు బేస్ క్యాంప్ చేరుకున్న బాలికగా రికార్డు సృష్టించింది. గత డిసెంబర్ లో తల్లి విక్టోరియా, 11 ఏండ్ల అన్న నికోలస్ తో కలసి బ్రిటన్ కు చెందిన యాష్ లీన్ మాన్‌డ్రిక్ ఎవరెస్టును ఎక్కడానికి నేపాల్ వెళ్లింది. ఈశాన్య నేపాల్ లోని లుక్లా ప్రాంతం నుంచి తల్లి, అన్నతో కలిసి బేస్ క్యాంప్ కు జర్నీ మొదలు పెట్టింది. 12 రోజుల్లో క్యాంప్ కు చేరుకుంది. ఐదున్నర కిలో మీటర్లఎత్తుకు చేరుకున్న తర్వాత యాష్ లీన్.. ‘ఇది చాలా ఈజీ’ అని చెప్పింది. గతేడాది సెప్టెంబర్ లోనే ఆఫ్రికాలోని కిలి మంజారోను ఎక్కేసిందీ చిన్నది.