ఉస్తాద్ రామ్(Ustaad Ram), మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati) కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ స్కంద (Skandha). అఖండ వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి నుండి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ కు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న ఈ సినిమా నుండి తాజాగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
An Electrifying Celebration of Mass with boundless energy?#SkandaPreReleaseThunder ⚡️ on August 26th ❤️?#SkandaOnSep15 #RAPOMass
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 24, 2023
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/bp8OAzpvtl
స్కంద థియేట్రికల్ ట్రైలర్‌ను ఆగష్టు 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని అధికారింగా ప్రకటిస్తూ.. ప్రీ రిలీజ్ థండర్ అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కోసం కూడా రామ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.