ఖమ్మం రూరల్, వెలుగు : తేనెటీగల పెంపకం ద్వారా ఖైదీల్లో స్కిల్ డెవలప్ అవుతుందని, వారు రిలీజై బయలకు వెళ్లాక యూనిట్ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందవచ్చని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్మండలం దానవాయిగూడెంలో సబ్ జైలులో తేనెటీగల పెంపకం యూనిట్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జైళ్లలో ఎపీ కల్చర్యూనిట్లను ప్రారంభిస్తున్నామని, ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా జైలు ఆవరణలో యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. ఇది రాష్ట్రంలో నాలుగో యూనిట్ అన్నారు. ఇక్కడ తయారయ్యే తేనెలో ఎలాంటి ప్రాసెసింగ్, ఫ్రిజర్వేటివ్స్ఉండవన్నారు. స్వచ్ఛమైన తేనెను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పలు జైళ్లలో యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు.
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగేందుకు ఎపి కల్చర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తేనెటీగల పెంపకం ద్వారా నాణ్యమైన తేనెను స్టాళ్లలో విక్రయిస్తామన్నారు. కార్యక్రమంలో ఐజీ మురళీబాబు, డీఐటీ సంపత్, ఖమ్మం జైల్సూపరింటెండెంట్ శ్రీధర్పాల్గొన్నారు.
