
హైదరాబాద్, వెలుగు: విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు కొత్త ఆవిష్కరణలు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. కరోనా విద్యారంగంలో అనేక సమస్యలను సృష్టించిందని, అయితే టెక్నాలజీ ద్వారా వాటిని అధిగమించొచ్చని అన్నారు. వరల్డ్ తమిళ్ చాంబర్ ఆఫ్ కామర్స్, గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఆరిజిన్ సంస్థల ఆధ్వర్యంలో శనివారం ఆన్‌లైన్ లో నిర్వహించిన “ఇన్నో వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ సమ్మిట్”లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. స్టూడెం ట్లకు స్కిల్స్ ముఖ్యమని, ‘స్కిల్ ఇండియామిషన్’ ద్వారా కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు.