నెయిల్​ పాలిష్​ ఆరబెట్టే మెషిన్లతో చర్మ క్యాన్సర్​ రిస్క్

నెయిల్​ పాలిష్​ ఆరబెట్టే మెషిన్లతో చర్మ క్యాన్సర్​ రిస్క్

వాషింగ్టన్: బ్యూటీ పార్లర్లు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. తక్కువ టైంలో మెరుగైన సేవలందించేందుకు పోటీపడుతున్నాయి. ఇందుకోసం అత్యాధునిక మెషిన్లను వాడుతున్నాయి. గోళ్లకు వేసే రంగు (నెయిల్​ పాలిష్) ను తొందరగా ఆరబెట్టేందుకు డ్రైయింగ్​ ల్యాంప్​ వాడుతున్నాయి. ఈ మెషిన్ల నుంచి వచ్చే అల్ట్రా వయొలెట్​(అతినీలలోహిత) కిరణాలతో రంగు తొందరగా ఆరిపోతుంది. నెయిల్​ పాలిష్​ వేశాక.. ఆ వేళ్లను యూవీ డ్రైయింగ్​ ల్యాంప్​ కింద పెడితే సెకన్ల వ్యవధిలోనే పాలిష్​ గట్టిపడిపోతుంది. ఇక్కడి దాకా అంతా ఓకే.. అయితే, ఈ యూవీ డ్రైయర్​ల వాడకం వల్ల ఏర్పడే రిస్క్​గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియా యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. యూవీ డ్రైయింగ్​ ల్యాంప్​ల నుంచి 340 నుంచి 395 నానోమీటర్ల ఫ్రీక్వెన్సీ కలిగిన యూవీ కిర ణాలను వాటిపై ప్రసరింపచేస్తారు. వీటివల్ల చర్మంలోని కణాలపై పడుతున్న ప్రభావాన్ని గుర్తించేందుకు 2 రకాల మనుషుల కణాలు.. కెరాటినోసైట్స్, ఫోర్​ స్కిన్​​ఫైబ్రో బ్లాస్ట్స్  లతో పాటు ఎలుకలకు చెందిన ఎంబ్రయోనిక్​ ఫైబ్రో బ్లాస్ట్​ కణాలపైన వర్సిటీ సైంటిస్టులు రీసెర్చ్ చేశారు.

20 నిమిషాలలో 30% కణాలు నాశనం

ఈ కణాలపై 20 నిమిషాల పాటు యూవీ కిరణా లు పడేలా చేశారు. ఆపై వాటిని పరీక్షించగా.. దాదాపు 30% చర్మ కణాలు చనిపోయినట్లు గుర్తించారు. దీంతో పాటు మిగతా చర్మ కణాల డీఎన్​ఏ డ్యామేజ్​ అయినట్లు సైంటిస్టులు తెలిపా రు. ఈ మార్పులతో చర్మ కణాలు పెరిగిపోయి, ఇది క్యాన్సర్​కు దారితీస్తుందని హెచ్చరించారు.