వర్జీనియాలో ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గాలిలో నుంచి పారాచూట్ సహాయంతో స్టేడియంలోకి దిగాల్సిన ఓ స్కైడైవర్, అదుపు తప్పి స్టేడియం స్కోర్‌బోర్డ్‌ను ఢీకొట్టాడు.
బ్లాక్స్‌బర్గ్‌లోని లేన్ స్టేడియంలో శనివారం ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు ప్రేక్షకులను అలరించడానికి స్కైడైవర్లు గాలిలో నుంచి కిందికి దిగుతున్నారు. ఈ క్రమంలో ఒక స్కైడైవర్ నేరుగా స్టేడియంలోని పెద్ద స్కోర్‌బోర్డ్‌ను ఢీకొట్టి, అక్కడే చిక్కుకుపోయాడు.
20 నిమిషాల ఉత్కంఠ!
ఆ స్కైడైవర్ స్కోర్‌బోర్డ్ పైభాగంలో ఉన్న అక్షరాల మధ్య పారాచూట్‌తో దాదాపు 20 నిమిషాల పాటు గాలిలో వేలాడుతూనే ఉన్నాడు. చివరికి భయపడకుండా, తన దగ్గర ఉన్న అమెరికా జెండాను, చిన్న పారాచూట్‌ను కింద ఉన్న ప్రేక్షకుల గ్యాలరీలోకి జారవిడిచాడు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు అత్యంత చాకచక్యంగా అతడిని సురక్షితంగా కిందకు దించాయి.
►ALSO READ | చైనాలో వింత అంత్యక్రియలు: చనిపోయిన వ్యక్తితో పాటు రూ. 1.5 కోట్ల మెర్సిడెస్ కారు ఖననం!
వర్జీనియా టెక్ అధికారులు ఈ ఘటనపై స్పందిస్తూ.. "స్కైడైవర్‌ను సురక్షితంగా రక్షించాం. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది" అని Xలో ప్రకటించారు.
మ్యాచ్ ఆలస్యం
ఈ ప్రమాదం కారణంగా జరగాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్ దాదాపు ఒక గంట పాటు ఆలస్యమైంది. వేగంగా స్పందించి ప్రాణాలు కాపాడిన మెడికల్ టీమ్‌కు, ఫైర్ సిబ్బందికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

