
దేశంలో కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల పాత భవనాలు మెత్తబడి కూలుతున్నాయి. తాజాగా పంజాబ్, అమృత్ సర్ లోని గురనానక్ పురా ప్రాంతంలో వర్షాల వల్ల ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి ఈ ప్రాంతంలో భారీగా వర్షం కురిసింది. దాంతో ఇంటి గోడలు బాగా మెత్తబడి రాత్రి 2 గంటల సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో 9 మంది ఉన్నారు. గాయపడిన వారిని అమృత్ సర్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. ఆ ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు.
మూడు రోజుల క్రితం మహారాష్ట్రలో ఓ ఐదంతస్తుల భవనం కూలి 15 మంది చనిపోయారు. ఆ ఘటనను మరవకముందే ఈ ఘటన జరిగింది. పాతబడ్డ ఇళ్లలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Amritsar: Three people killed, four injured after roof of a building collapses, in Guru Nanak Pura area, following heavy rainfall last night pic.twitter.com/YePkMlopla
— ANI (@ANI) August 28, 2020
For More News..