హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మరో ఇంటర్నేషనల్ స్పోర్ట్ ఈవెంట్‌కు వేదిక కానుంది. ఈ నెల 25 నుంచి యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో స్లాన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. ఫిడే 1600 రేటింగ్‌కు దిగువన ఉండే మాస్టర్లు ఈ టోర్నీలో పోటీపడనున్నారు. ఈ లెవెల్ టోర్నీ సిటీలో జరగడం తొలిసారి కానుంది.
ఈవెంట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ శనివారం ఎల్బీ స్టేడియంలో ఆవిష్కరించారు. కెనడా, యెమన్, అమెరికా దేశాలతో ఇండియా నుంచి 15 రాష్ర్టాల చెస్ ప్లేయర్లు పోటీ పడతారని స్లాన్‌స్పోర్ట్స్ సీఓఓ నవీన్ తెలిపారు. స్విస్ సిస్టమ్‌లో తొమ్మిది రౌండ్ల పాటు జరిగే ఈవెంట్‌లో విన్నర్లకు రూ.10 లక్షల ప్రైజ్‌మనీ లభిస్తుందన్నారు.
రిజిస్ర్టేషన్స్, ఇతర వివరాలకు 7386377787 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఓవరాల్‌గా 94 నగదు బహుమతులు, 300 ప్రోత్సాహక బహుమతులు ఉంటాయన్నారు.
