
నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత తీవ్రమైంది. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ సొసైటీకి యూరియా స్టాక్ రానుందని తెలిసిన రైతులు సోమవారం రాత్రే చెప్పులు, ఆధార్ కార్డులు, పాస్ బుక్కులు క్యూలో పెట్టారు. రాత్రి నుంచే పడిగాపులు పడుతున్నారు. - వెలుగు, నిజామాబాద్