విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘స్లమ్ డాగ్’. 33 టెంపుల్ రోడ్ అనేది క్యాప్షన్. టబు, సంయుక్త, దునియా విజయ్ కీలక పాత్రలు పోషించారు. సోమవారం చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ తమిళ రీమేక్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించిన నేను ఇప్పుడు ఆయన డైరెక్షన్‌లో నటించడం సంతోషంగా ఉంది. తనకున్న ఎక్స్‌పీరియన్స్, స్క్రిప్ట్, సీన్ పట్ల ఉన్న క్లారిటీతో యాక్టర్స్‌ను చాలా కంఫర్ట్ జోన్‌లో ఉంచుతారు.
ఆయన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అవుతుందని నమ్ముతున్నా’ అని చెప్పారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘సేతుపతి గారి సింప్లిసిటీ నాకిష్టం. సెట్‌లో ప్రతిరోజు కొత్త నటుడిగా వచ్చేవారు. పవర్‌ఫుల్ అండ్ యూనిక్ విజయ్ సేతుపతిని ఇందులో చూస్తారు.
రియల్ ఇన్సిడెంట్స్, రియల్ ఎమోషన్స్ ఆధారంగా తీసిన సినిమా ఇది. ఇదొక యాక్షన్ సినిమా. కానీ ఎంతో ఎమోషన్ ఉంటుంది. మనం బెగ్గర్స్‌ను అంతగా పట్టించుకోం. కానీ వాళ్ల జీవితాల్లో చాలా ఎమోషన్ ఉంటుంది. ఇది నెక్స్ట్ జనరేషన్, జెన్ జీ యూత్ కోసం తీసిన సినిమా. వాళ్లంతా తమ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా” అని చెప్పారు.
సంయుక్త మాట్లాడుతూ ‘ఇందులో రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ నాది. సేతుపతి గారికి హ్యూజ్ ఫ్యాన్‌ని. ఆయన వెరీ సింపుల్. ఫుల్ డే షూట్ కూడా పూరి గారు హాఫ్ డేలోనే పూర్తి చేయడం చూసి సర్‌ప్రైజ్ అయ్యా’ అని చెప్పింది. ‘రియలిస్టిక్ యాక్షన్, గ్రౌండెడ్ హ్యూమన్ ఎమోషన్స్ బ్లెండ్ చేసిన సినిమా ఇది’ అని నిర్మాత ఛార్మి చెప్పారు. నటుడు వీటీవీ గణేష్, నిర్మాత జేబీ నారాయణరావు కొండ్రొల్ల, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్, సీఈవో విషురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
