
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట సీపీగా ఎస్.ఎం. విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు రవీందర్ రెడ్డి, నరసింహులు, సదానందం, రవీందర్, సుమన్ కుమార్ సీపీని మర్యాద పూర్వకంగా కలసి మొక్కలను అందజేశారు.
అనంతరం సీపీ ఆఫీసులో ఉన్న అన్ని విభాగాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ అందరూ కలిసి టీం వర్క్ చేయాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.