తెలంగాణలో స్మార్ట్​, అమృత్​ సిటీలు

తెలంగాణలో స్మార్ట్​, అమృత్​ సిటీలు

కేంద్ర ప్రభుత్వం స్మార్ట్​ సిటీస్​ మిషన్​, అమృత్ప్రోగ్రామ్​ల కింద తెలంగాణ రాష్ట్రంలోని అనేక నగరాలు మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం నియమించబడ్డాయి. స్మార్ట్​ సిటీస్​ మిషన్​ దేశ వ్యాప్తంగా 100 నగరాలను (109 నగరాలకు సవరించారు) అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పట్టణ పునరుద్ధరణ, పునర్నిర్మాణ కార్యక్రమం. ఆయా నగరాల్లోని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మిషన్​ను అమలుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతమున్న మధ్యతరహా నగరాలను ఆధునికీకరించడం ద్వారా 100 స్మార్ట్​ సిటీలను పెద్ద నగరాల ఉపగ్రహ పట్టణాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో వరంగల్​, కరీంనగర్ స్మార్ట్​ సిటీలు ఉన్నాయి. 

అమృత్​ నగరాలు 

అమృత (అటల్​ మిషన్​ ఫర్​ రిజువేనేషన్​ అండ్​ అర్బన్​ ట్రాన్స్​ ఫర్మేషన్​) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015, జూన్​లో ప్రారంభించారు. ఈ పథకం పట్టణ మార్పు కోసం పటిష్టమైన మురుగునీటి నెట్​వర్క్​లు, నీటి సరఫరా లక్ష్యంగా ఉంది. అమృత్​ కింద రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికను సమర్పించిన తొలి రాష్ట్రం రాజస్తాన్​. తెలంగాణ రాష్ట్రంలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో 12 అమృత్​ నగరాల్లో నీటి సరఫరా పెంచేందుకు ప్రణాళికను సమర్పించింది. హైదరాబాద్​, వరంగల్​, నిజామాబాద్​, కరీంనగర్​, రామగుండం, ఖమ్మం, మహబూబ్​నగర్​, నల్లగొండ, ఆదిలాబాద్​, 
మిర్యాలగూడ, సిద్దిపేట.