తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా (THDC) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లై న్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారము సమర్పించడానికి చివరి తేదీ జనవరి 31.
ఖాళీలు: 50.
ట్రేడ్ అప్రెంటీస్ (ఐటీఐ): కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 08, ఎలక్ట్రిషియన్ 08, డ్రా మన్ (సివిల్) 04, ఫిట్టర్ 04, రిఫ్రిజిరేషన్ 04, ఎలక్ట్రానిక్ మెకానిక్ 02.
ఇంజినీరింగ్ అప్రెంటీస్: సివిల్ ఇంజినీరింగ్ 05. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 04, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 05. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ బీబీఏ 03, మెకానికల్ ఇంజినీరింగ్ 01, ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్/మెకాట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ 02.
ఎలిజిబిలిటీ
ట్రేడ్ అప్రెంటీస్ (ఐటీఐ): 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్ లో ఎస్సీవీటీ నుంచి చెల్లుబాటు అయ్యే ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అన్ రిజర్వ్ / ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఇంజినీరింగ్ అప్రెంటీస్: గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం/ సంస్థ నుంచి సంబంధిత బ్రాంచ్ విభాగంలో బి.టెక్ / బీఈ / బీబీఏ/ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. ఆన్ రిజర్వ్ / ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.. ఎలాంటి ఫీజు లేదు..
లాస్ట్ డేట్: జనవరి 31.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ కనబర్చిన ప్రతిభ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.thdc.co.in వెబ్ సైట్ ను సందర్శించండి.
