గ్రామాభివృద్ధి మీ చేతుల్లోనే..CMO సెక్రటరీ స్మితా సబర్వాల్‌‌‌‌

గ్రామాభివృద్ధి మీ చేతుల్లోనే..CMO సెక్రటరీ స్మితా సబర్వాల్‌‌‌‌

ఇందల్‌‌‌‌వాయి, వెలుగు: మీ గ్రామాభివృద్ధి మీ చేతుల్లోనే ఉందని సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌‌‌‌ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్‌‌‌‌వాయి మండలం చంద్రయాన్‌‌‌‌పల్లి గ్రామంలో పల్లె ప్రగతి పనులను ఓఎస్‌‌డీ ప్రియాంక వర్గీస్‌‌‌‌, జిల్లా కలెక్టర్‌‌‌‌ నారాయణ రెడ్డి తో కలిసి సోమవారం పరిశీలించారు. గ్రామ పంచాయతీలో మొక్క నాటి నీరు పోశారు . గ్రామంలోని అంగన్‌‌‌‌వాడీ కేంద్రాన్ని చూశారు.అంగన్‌‌‌‌వాడీ కేంద్రం ఉన్నా ఎక్కువ మంది పిల్లలు ప్రైవేట్‌‌‌‌స్కూల్స్‌‌‌‌కి వెళ్లడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

నిధులను ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేయాలని సూచించారు.గ్రామస్తులు కోతుల సమస్యతో ఇబ్బం ది పడుతున్నట్లు తెలుసుకున్న ఓఎస్‌‌‌‌డీ ప్రియాంక వర్గీస్‌‌‌‌ గ్రామానికి దూరంగా పండ్ల చెట్లు పెంచడం ద్వారా కోతుల సమస్య తగ్గిం చవచ్చని అన్నారు. ప్రజలకు అవసరమైన మొక్కలను గ్రామ నర్సరీలో పెంచి అందివ్వాలని సూచించారు. జిల్లాలో గ్రామాభివృద్ధికి డొనేషన్స్‌‌‌‌‌‌ఇవ్వాలని ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని జిల్లా కలెక్టర్‌‌‌‌నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధికి రూ. 1.21 కోట్లు వచ్చాయన్నారు. మరింత మంది డొనేషన్స్‌‌‌‌కి ముందుకు రావాలని కోరారు.