
ట్రిచీ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన స్కూట్ ఎయిర్‌వేస్ TR 567 విమానంలో పొగ రావడంతో పైలెట్ విమానాన్ని చెన్నైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఇవాళ(సోమవారం) తెల్లవారు ఝామున ట్రిచీ ఎయిర్ పోర్టు నుంచి స్కూట్ ఎయిర్‌వేస్ టీఆర్ విమానం సింగపూర్ వెళ్లేందుకు బయలుదేరింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో పొగ రావడాన్ని పైలెట్ గమనించి, విమానాన్ని తెల్లవారుఝామున 3.40 గంటలకు అత్యవసరంగా చెన్నై విమానాశ్రయంలో దించారు. ఈ విమానంలో 161 మంది ప్రయాణిలున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఈ విమానం సోమవారం సాయంత్రం సింగపూర్‌కు బయలుదేరి వెళ్తుందని విమానాశ్రయం అధికారులు చెప్పారు. పొగరావడానికి కారణాలపై విమానాన్ని పరిశీలిస్తున్నారు ఇంజినీర్లు.