స్మోకింగ్ మానేస్తే కరోనా రిస్క్ ఉండదా?

స్మోకింగ్ మానేస్తే కరోనా రిస్క్ ఉండదా?

మీకు స్మోకింగ్ అలవాటు ఉందా అయితే త్వరగా మానేయడం మంచిది. ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల గుండె నొప్పి రావడం, ఊపిరితిత్తులు పాడవ్వడం, షుగర్, క్యాన్సర్ లాంటి ప్రమాదకర రోగాల బారిన పడతారన్నది తెలిసిందే. వీటితోపాటు స్మోకర్స్‌కు కరోనా ముప్పు కూడా ఎక్కువేనని తేలింది.

స్మోకర్స్‌కు కరోనా రిస్క్ ఎక్కువని, వారు వైరస్ బారిన పడితే చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారితో పోల్చుకుంటే స్మోకర్స్‌‌కు కరోనాతో 50 శాతం హైరిస్క్ ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. థొరాక్స్ జర్నల్‌లో పబ్లిష్‌లో అయిన ఓ ఆర్టికల్ ప్రకారం.. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు, ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటాయి. కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్‌ను తట్టుకోవడం చాలా కష్టమవుతుంది.

స్మోకింగ్ మానేస్తే ప్రయోజనాలేంటి?

స్మోకింగ్‌ మానేసిన వారిలో ఓ వారంలోనే ఆరోగ్య పరంగా మంచి తేడాలను గమనించొచ్చని లండన్‌‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు నిర్వహించిన స్టడీలో తేలింది. పొగతాగడం మానేసిన వారిలో ఊపిరితిత్తులు మెరుగవ్వడం, రోగనిరోధక శక్తి పెరిగినట్లు కొన్ని స్టడీలు పేర్కొన్నాయి. స్మోకింగ్‌ను క్విట్ చేస్తే కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడే రిస్క్‌ను తగ్గిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.

క్విట్ టొబాకో క్యాంపెయిన్

స్మోకింగ్ అలవాటు నుంచి త్వరగా బయటపడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ అంటున్నారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు హెల్తీ లైఫ్ స్టయిల్‌ను అలవాటు చేసుకోవాలని టెడ్రోస్ సూచిస్తున్నారు. ఈ క్రమంలో టోబాకో ఫ్రీ ఎన్విరాన్‌‌మెంట్స్‌‌కు మద్దుతుగా తాము చేపట్టిన ‘కమిట్ టూ క్విట్ టొబాకో‘కు సపోర్ట్ చేయాలని కోరారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా కోట్లాది టొబాకో యూజర్ల (పొగతాగే వారు)కు స్మోకింగ్‌‌ మానేందుకు సాయం చేసే టూల్‌కిట్‌ను ఉచితంగా అందిస్తున్నారు. స్మోకింగ్ నుంచి బయటడాలని ఉన్నా సాయం అవసరమైన వారికి అండగా నిలుస్తున్నామని డబ్ల్యూహెచ్‌వో వివరించింది.