చిన్న వయసులో సిగరెట్ అలవాటు ప్రమాదమే.. పరిశోధనల్లో వెల్లడి

చిన్న వయసులో సిగరెట్ అలవాటు ప్రమాదమే.. పరిశోధనల్లో వెల్లడి

సిగరెట్ తాగడం మానలేకపోతున్నారా..సిగరెట్ తాగకుంటే పిచ్చెక్కి పోతుందా..కొందరైతే చైన్ స్మోకింగ్ చేస్తుంటారు. అయితే స్మోకింగ్ అలవాటు మానుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుంది.. ఒకసారి సిగరెట్ తాగడం అలవాటయితే లైఫ్ లో మళ్లీ పొగతాగడం మానలేమా వంటి  సందేహాలు కలుగుతుంటాయి. అయితే సిగరెట్ స్మోకర్స్పై ఇటీవల  జరిగిన అధ్యయనాలు జరిగాయి.  ఈ అధ్యయనాల్లో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.  

20 సంవత్సరాల వయస్సు కంటే ఎక్కువ వయస్సులో పొగతాగడం మొదలు పెట్టిన వారికంటే.. 20 కంటే తక్కువ వయసులో మొదలు పెట్టినవారు పొగతాగడం మానడం చాలా కష్టం అని.. ఆరోగ్యానికి ప్రమాదకరమని  ఇటీవల జపాన్ కు చెందిన డాకర్లు జరిపిన అధ్యయనంలో  తేలింది.

ప్రతిరోజూ సిగరెట్ తాగే 10 మంది పెద్దలలో దాదాపు 9 మంది మొదట 18 సంవత్సరాల వయస్సులో ధూమపానానికి ప్రయత్నిస్తారని అంచనా వేశారు. యుక్తవయస్సులో కూడా ధూమపానం ప్రారంభించడం అధిక నికోటిన్ డిపెండెన్సీతో ముడిపడి ఉందని, ఆలస్యంగా ప్రారంభించిన వారితో పోలిస్తే ప్రారంభంలో ప్రారంభించినవారు అలవాటును విడిచిపెట్టే అవకాశం 30 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. 

20 యేళ్ల కంటే తక్కువ వయసులో పొగ తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొగాకు కొనడానికి చట్టబద్ధమైన వయస్సును 22 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సుకు పెంచడం వల్ల నికోటిన్‌కు బానిసలైన వారి సంఖ్య తగ్గుతుందని, ప్రతికూల ఆరోగ్య పరిణామాలకు గురయ్యే ప్రమాదం తగ్గుతుందని జపాన్ కు చెందిన అధ్యయన రచయిత డాక్టర్ కోజీ హసెగావా చెప్పారు.