సిగరెట్ తాగితే వచ్చే రోగాలు

సిగరెట్ తాగితే వచ్చే రోగాలు

సిగరెట్ ను మనిషి తాగితే.. మనిషిని సిగరెట్ తాగేస్తుంది. అతని జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది కోటేషనే కాదు.. జీవిత సారం కూడా. చాలా మంది సిగరెట్ ను సరదాగా మొదలు పెట్టి దానికి బానిసలైన వారే. రోజుకు ఒక్కటి తాగినా సరే.. ప్రభావం మాత్రం ఉంటుంది. ముఖ్యంగా యువత రోజురోజుకు సిగరెట్ భారిన పడుతున్నారు. అయితే సిగరెట్ తాగడం వల్ల ఏయే రకాల రోగాలు మనిషిని పట్టి పీడిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సిగరెట్ తాగడం వల్ల 45 రకాల క్యాన్సర్ లు వస్తాయని డాక్టర్లు తెలిపారు. దీంతో పాటు సెక్స్ లైఫ్ హరించుకుపోవడం, ఇన్ఫెర్టిలిటీ వంటి సమస్యలు వస్తాయని చెప్పారు.

ఊపిరి తిత్తుల క్యాన్సర్…
సిగరెట్ తాగేవారిలో ఊపిరి తిత్తుల క్యాన్సర్ రావడానికి అధికమైన అవకాశాలు ఉన్నాయి. సిగరెట్ తాగినపుడు.. అందులో నుంచి వచ్చే కెమికల్స్ ఊపిరితిత్తులలోని కణాలను నాశనం చేస్తాయి. దీంతో పాటు.. కొత్త కణాలు ఏర్పాటు కాకుండా ఊపిరి తిత్తులు పూర్తిగా కుశించుకుపోయేలా చేస్తాయి.

పెరాలసిస్..
సిగరెట్స్ తాగడం వల్ల రక్తం లో చిన్న చిన్న గడ్డలు ఏర్పడతాయి. అవి రక్త ప్రసరణలో బాగం అయి… మెదడులో ఉండే చిన్న రక్తనాలలో ప్రవహించి అక్కడ రక్తం గడ్డ కట్టేలా చేస్తాయి. దీంతో బ్రేన్ స్ట్రోక్ వస్తుంది. శరీరం చచ్చుబడే అవకాశం కూడా ఉంది.

పిల్లల్లో జన్యు సమస్యలు
స్మోకింగ్ చేసే వారిలో వీర్య కణాల నాణ్యత తగ్గుతుంది. వీరి పార్ట్ నర్ కు గర్భస్రావం జరిగే అవకాశం ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఒక వేళ పిల్లలు పుట్టినా జన్యుసంబందమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

నోటి క్యాన్సర్..
స్మోకింగ్ వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్ తో పాటు.. నోటి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందుగా నోటి కణాల మీద ప్రభావం పడి శరీరంలోని కణాల్లో వేగంగా మార్పులు జరుగుతాయి.

పూర్ సెక్స్..
సిగరెట్స్ లో ఉండే నికోటిన్ వల్ల శీగ్రస్కలన సమస్యలు, లైంగిక  సమస్యలు, వీర్యకణాల కౌంట్ తగ్గటం ఏర్పడుతుంది.