రాహుల్ అబద్ధాలు చెప్తున్నడు: స్మృతి ఇరానీ

రాహుల్ అబద్ధాలు చెప్తున్నడు: స్మృతి ఇరానీ

అమేథీ (యూపీ): ఉత్తరప్రదేశ్లోని అమేథీనియోజక వర్గంలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫుడ్ పార్క్కు పర్మిషన్ ఇచ్చేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే నిరాకరించిందని ఆదివారం చెప్పారు. ‘‘రైతుల ప్రయోజనాల గురించి రాహుల్ మాట్లాడుతున్నారు. ఫ్యాక్టరీల ఏర్పాటు పేరుతో గతంలో రైతుల భూములనే లాక్కున్నారు. భూములు వెనక్కి ఇవ్వాలని మూడేళ్లకిందటే కోర్టు ఆదేశించినా , ఇంకా అప్పగించలేదు” అని విమర్శించారు. ‘‘వేర్పాటువాదనేత యాసిన్ మాలిక్ ముందు కాంగ్రెస్ తలవంచుతోంది. నలుగురు ఎయిర్ ఫోర్స్ జవాన్లను చంపిన కేసులో అతడు నిందితుడు.కాశ్మీర పండిట్ల ఊచకోతలో, పండిట్లను అక్కడి నుంచి తరిమివేయడంలో మాలిక్ ప్రమేయం ఉంది.” అని డిమాండ్ చేశారు.